నీరాజనం…నీరాజనం…నీలి నయనాల నీలకంఠునికి నిత్య నీరాజనం…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

నీరాజనం…నీరాజనం…నీలి నయనాల నీలకంఠునికి నిత్య నీరాజనం…
ఉద్దీపనం…ఉద్దీపనం… జడల గంగాధర గౌరీ మహేశునికి హృదయ హారతుల ఉద్దీపనం…
అందుకోవయ్య..అందుకోవయ్య శివశంకరా…
మమ్మాదుకొనరావయ్య ప్రణవనాద ప్రియ అభయంకరా…!!నీరా!!

పాప పంకిలమైన ఆలోచనా సరళితో…
కోరి పడుతున్నాము కష్టాల కొలిమిలో…
దైవ చింతన లేని మనుగడను సాగించుతూ…
తెలిసి పడుతున్నాము నిరాశా నిస్పృహల సుడి గుండాలలో…
కడతేర్చరా శంకరా..నేనున్నాని
కూకటి వేళ్ళతో పెకిలించి మాలోన పెరిగున్న నడమంత్రపు సిరి మానుని…
!!నీరాజనం!!

మాలోన వెలగాలి నీ దివ్యజ్యోతి…
ఆ వెలుగుకే చిగురులేయాలి  మాలోన భక్తి..
మరిచానని నిన్ను కార్చాలి మా రెండు కళ్ళు కన్నీరు కడివెడు…
ఇంకిపోయేదాక ఏడ్చి పశ్చాత్తాపము చెంది మనిషినవుతానని మారాలి  మాలోని దానవుడు…!!నీరాజనం!!

పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం…
రక్షమామ్..రక్షమాం.. సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top