ఓమ్ నమ:శ్శివాయ నమ:
పక్కనే ఉంటావట కదా శంకరా…పలుకవయ్యా…
భక్తితో పిలిచాను బదులివ్వవయ్య..
ఏ తప్పు చేసివున్నా మన్నించరా విభూది నామాల సామీ..
ఏ చిన్న శిక్ష వేసినా తట్టుకోలేమురా వెండి కొండల బంగారు సామీ…
కరుణించితే చాలయ పరమాణువంత..
ఋణపడి ఉంటాము నీకు కైలాస గిరుల మేరు నగమంత…!!పక్కనే!!
మలుపు మలుపులో మా జీవితం..
గెలుపు ఓటములతో నిత్యమూ సతమతం…
పోరాడ పాడేము ప్రతిసారి నీ ప్రణవ గీతం…
ఓటమెదురైనా వెరవకు తుది గెలుపు నీదేనని తెలుపు దివ్యసంకేతం…
ఊహించని విజయ తీరాలలో ఎగురవేయిస్తావు మా విజయ బావుట…
కీర్తి శిఖరాగ్రాల అంచున కూర్చుండబెట్టి మురిసిపోతావు అటుపిమ్మట….!!పక్క!!
పట్టించుకోవనుకుంట ఒక్కోసారి పార్వతీ సుతుల ముద్దు మురిపాలను…
తలకెక్కించుకినుటలో లీనమై కోటానుకోట్ల భక్త జన దీనగాధలను..
విన్నాడో లేడో శివుడని విలపిస్తూ చూసే లోగా…
కనిపించక కరుణిస్తావు క్షణములో విస్తుపోయేలాగ…
ఇంతకన్నా ఋజువు ఏమున్నదయా…
నువ్వున్నావన్న నిజము జగమెరిగిన సత్యమేనయా..!!పక్క!!
పాహిమామ్..పాహిమాం.. పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం.. రక్షమాం.. సర్వేశ్వరా రక్షమాం..