ఓమ్ నమ:శ్శివాయ నమ:
పలుకుతుంటే శంకరా…సుస్వరముతో నీ నమక చమకం…
కమనీయనాదమై జతకలిసె ఈశ్వరా..నీ చేతి ఢమరుకం…
లయబద్దమైన శబ్ధ సంగీత సాహిత్య శ్రవణమై…
వినిపించె విశ్వమంతా లోక కళ్యాణము కొరకు శంకరాభరణ
రాగమై….
ఫాలభాగమునుండి ఆదిత్యుడు ప్రసరించుతుంటే నీ దివ్యకిరణాలని …
ఆనంద భాష్పాల నయనాలతో ఈ జగతి నిను గాంచనీ!!పలుకుతుంటే!!
తట్టిలేపేవయా అందరినీ రమ్మంటు నీ గుడివాకిటకని…
ఒట్టి చేతులతో పంపవయా వచ్చాక దీవించక మమ్ములని…
మేమొసగు కాసిన్ని పువ్వులు,కొబ్బరికాయలు, ఫలములు…
తీసుకొని తీర్చేవు ఎన్నెన్నో మా కర్మ ఫలములు…
కరుణ మానస హృదయ కాళేశ్వరా…
మేమెన్ని సేవలు చేస్తే మా ఋణము తీరేనురా..!!పలుకు!!
వమ్ముకానీయవయా శంకరా…నీ పైన మా నమ్మకం…
నిను నమ్మికొలుచువారికి ఎదురవదు ఏ ప్రతిబంధకం…
దారి చూపేదైవమై మా వెంట ఉంటావు…
వెన్నుపూసై వెన్నంటి వుండి మమ్ము నడిపిస్తావు..
తరగవేమో శంకరా…ఎంత తొలచినా నీ కరుణ గనులు…
తొలచిన కొలదీ ఇంకాస్త పెరుగునేమో నీ మది లోన మా పుణ్యాల నిధులు…!!పలుకుతుంటె!!
పాహిమాం…పాహిమామ్….పరమేశ్
రక్షమాం.. రక్షమాం.. సర్వేశ్వరా.. రక్షమామ్…