ముద్రించుకోనా శంకరా నీ రూపము…

ముద్రించుకోనా శంకరా నీ రూపము…
భద్రపరచుకొనగ పదిలముగ నా హృదిలోన నీ ప్రతి రూపము…
మా గుండె కావాలి నీ మందిరం…
మా ఉచ్వాస నిశ్వాస శబ్దాలలో పలకాలి నీ ప్రణవ నాదం…!!ముద్రించు!!

నీ కరుణనిధులైన కంటి కనుపాపల ద్వయము..
తిలకించితే పొంగదా ఏ కఠిన పాషాణ హృదయమునైన ఆనంద అమృతముల సంద్రము..
వెతలను మరిపించు నీ దివ్య సుందర రూపము…
విరచించిన కొలదీ తరగనిది నీ ప్రేమతత్వము…
నీ కరుణా కటాక్షములు పొందగ చేసి వుండాలి పుణ్యము..
ఏ కాస్తైన నీదయ పొందని జన్మ పొందుటే  వ్యర్థము…!!ముద్రించు!!

కదలక మెదలక శిలవై గుడిలోనే ఉంటూ…
చెంతకు వచ్చి చెప్పుకొను దీనుల గాధలని వింటూ….
దర్శనభాగ్యముతో ఇచ్చేవయా ధైర్యమును…
నీ చూపులతో నింపేవయా మాలో లేని స్థైర్యమును…
రావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ నీగుడికి…
కోరాలనిపిస్తుంది వరమిమ్మని పరి పరి విధముల నీ పూజలు, సేవలు చేయటానికి….!!ముద్రించు!!

పాహిమాం..పాహిమాం.. పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం…

Leave a Comment

Scroll to Top