ఉన్నావయా శంకరా…మా మనసులో..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఉన్నావయా శంకరా…మా మనసులో..
మసలుతున్నావయా ప్రతి క్షణము మా తలపులో…
ఉజ్జయిని శ్రీ కాళలింగమా…
అమరనాధానా కొలువైన హిమలింగమా..!!ఉన్నావయా!!

ఓంకార రూపా నీకు మూడు దళముల పూజలు…..
అడ్డనామాలవాడా నీకు పంచాక్షరీ మంత్ర పద పఠనలు…
శృతిలోన  పలికేము నీ నామ గానమును…
వల్లకాదనక ఇవ్వరా సంతోషాల సిరిసంపదలను…
వలదు మాకింక ఏమణులు మాణిక్యాలు…
నీ కరుణ వీక్షణములే మాకు భోగభాగ్యములు…!!ఉన్నావయా!!

అవనిపై ఉన్నాయి ఎన్నెన్నో నీ పుణ్య గుడి మందిరాలు…
నిరాశా,నిస్పృహల వేదనలు కడతేర్చు దేవాలయాలు…
అడుగిడితే చాలయా ఒక్కసారి…
రావు కదా సంకటములు మరియొక్కసారి…
మా కోసమై వెలిశావు మాహేశ్వరా…
మనసు వెన్నపూసై వరమిచ్చు శివశంకరా…!!ఉన్నావయా!!

పాహిమామ్…పాహిమాం…శివశంకరా...
పరమపావనమైన నీ పదసన్నిధిన కొలువుండ వరమియ్యరా!!

Leave a Comment

Scroll to Top