ఓమ్ నమ:శ్శివాయ నమ:
వరసిద్ధి వినాయకా వరములియ్య రా…
పరమశివుని ప్రియసుతా… పూజలందుకొనగ రా…
జై గణేశ.. జై గణేశ.. జై గణేశా పాహిమాం…
శ్రీ గణేశ.. శ్రీ గణేశ.. శ్రీ గణేశ… రక్షమాం. !!వర!!
కాళేశుని గుడిలోనికి ఆవహిస్తివా…
కన్నతండ్రి ఋణము తీర్చ భక్తులకు అభయమిస్తివా…
ముద్దు సుతుని చూసి నేడు మురిసి పోయెనే శివా…
మూల స్థానమునే నీకు ఇచ్చి పొంగి పోయెనే శివా…!!వర!!
స్థూల కాయ, శూర్పకర్ణ నమో విఘ్న వినాయకా…
ఏకదంత గజానన సిద్ధిబుద్ధి ప్రదాయకా…
చేతుమయ్య గణనాధా మా మదే నీకు వేదిక..
ఆశీనుడివై ఉండిపోతే చాలు వలదు మాకు ఏమిక…
తీర్చవయా గణనాధా ఈ చిన్ని కోరిక…
అడుగుతున్నాము అర్థించి వరమునివ్వు కాదనక…!!వర!!