ఓమ్ నమ:శ్శివాయ నమ:
దండాలు..దండాలు..ఓ వక్రతుండ..
శతకోటి దండాలు గౌరమ్మ బంగారు కొండ…
లేకున్న ఎవరికీ నీ అండదండ…
జరుగునా ఏ కార్యమైన నీ పూజ చేయకుండా…!!దండాలు!!
మహాకాయ రూపా గణనాయకా…
నీ విశాల హృదయ పరిమాణమెంతో తెలుప సాధ్యమా మాకిక…
ముద్దు మోముతో మురిపించు మూషిక వాహన ప్రియా…
హద్దు లెరుగని భక్తి వాత్సల్యముతో నిను కొలవకుండ ఉండగలమా చెప్పయా…!!దండాలు!!
ఆడిపాడేవయా సోదరుడు కార్తికేయునితో…
ఆ ఆటలేవో తెలుపరా ఆడిపాడేము మా అన్నదమ్ములతో…
అపురూపమైన అనురాగ బంధాల విలువలను తెలుసుకొనగా…
అన్నదమ్ముల ప్రేమానురాగాల ప్రాముఖ్యతను పంచుకొనగ…!!దండాలు!!
పాహిమామ్..పాహిమామ్..గణనాయకా…
రక్షమామ్..రక్షమామ్..వరదాయకా