వరమియ్యరా గజాననా…
శైలపుత్రీ సుత ప్రియనందనా…
కరుణించరా..సూక్ష్మ నయనా…
కాత్యాయినీ పతి సుత కమలలోచన….
ప్రథమ పూజార్హత పొంది తొలి దైవమైనావు…
హృదయ బాంధవ్యముతో అందరికి అపురూపమైనావు…
సరదాలు, సందళ్ళతో పందిళ్ళలో చేసేమయా నీ పూజలు….
వయసెంతొ మరచి ఆడిపాడేరయా అందరూ నీ ముందు నీ భక్తులు…
ఎంతముదమో నీవంటే ఈ భువి జనానికి..
మరెంత మోదమో నీ చవితి పండగంటే ఇలలోన ప్రతి ప్రాణికీ…!!వరమియ్యరా!!
ఆది దంపతుల అనురాగ మధురిమలకు ప్రతి రూపానివై…
కైలాస శిఖరాల నడుమ దోగాడు ముద్దు మురిపానివై…
తల్లి గౌరమ్మ లాలనలో పెరిగావయా..
తండ్రి శంకరుని ఒడిలోన ఎదిగి పోయావయా..
అతల,సుతల, వితల,పాతాళ రసాతల, సర్వలోకములకు దైవమైనావయా…
వారు,వీరని కాక జాతి మతమని భేధము లేక భువి లోన ప్రతి ఒక్కరికీ ఇష్టమైనావయా…!!వరమియ్య!!
పాహిమాం..పాహిమాం..వరసిద్ధి వినాయక పాహిమాం..
రక్షమామ్..రక్షమామ్..శివశంకర తనయాయా రక్షమాం..