ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఎంత మధురమో శంకరా..
నీ నామ స్మరణము…
మాకెంత యోగమో పఠియించ నీ పంచాక్షరీ మంత్రము…
కనవయ్య…కనవయ్య శివశంకరా…
కరుణ సాగర హృదయ అభయంకరా…!!ఎంత!!
నిను దర్శించుకొనుటన్నది వేయి జన్మల ఫలము…
నిను ప్రార్ధించుటన్నది నీవు మాకు ఇచ్చిన వరము…
యజ్ఞయాగాదులేవి చేయకున్నా…
నీ సేవలో ప్రజ్ఞా పాటవములు ఏమంత లేకపోయినా..
మనసారా పఠియిస్తే చాలందువు పంచాక్షరీ మంత్రమును….
మహేశ్వరుడు…మాటిస్తున్నాడందు
చేరేవు ఎంచుకొని మాలోని నీ ప్రియ భక్తుల గుండెగుడిలోనికి….
నీ భక్తసమూహములో నేనొకడినైతె చాలు నా జన్మ ధన్యమవటానికి…
పాలు పోవటము లేదు శంకరా…ఏ రీతిన నీమదికి చేరువవగలనో…
పొద్దు తెల్లారినా అర్ధమవటము లేదు ఈశ్వరా…నీతో మమేకమవుటన్నది ఎట్లనో…
ఆపనయ్య….ఆపను ఈ అన్వేషణ…
అంతరాత్మ సాక్షిగా శోధిస్తూనే వుంటాను ముగియువరకు ఫణిభూషణా…
పాహిమామ్..పాహిమాం….పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…