ఏమివ్వగలవారము మేము శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఏమివ్వగలవారము మేము శంకరా…
నీకు మేము ఏమవ్వగలవారము ఈశ్వరా…
సుందర సుకుమార నయనాలతో వీక్షిస్తువుంటే…
మృధు మధుర దరహాసాలతో దీవిస్తువుంటే…!!ఏమి!!

నీకు మేము ఏమవతమో మాకు తెలియకున్నా మాకు అన్నీ నీవేనయా…
మాకు సర్వమూ సమకూర్చుతున్నా  నిను సేవించుటన్నది మరతుమయ్యా. .
బ్రతుకు బండి నడిచి నంత వరకూ విర్రవీగేస్తుంటాము..
చతికిల పడి అడుగు పడనపుడు “శంకరా” అని వేడుకుంటాము..!!ఏమివ్వగల!!

పాడుబుద్ధి పెడదోవలో మమ్ము నడిపిస్తున్నా…
కాపాడు తండ్రివి వలదని నీవు వారిస్తువున్నా…
వినదో వినిపించుకోదో ఈ మట్టి బుర్ర…
కర్మఫలముల బారినపడి మస్తిష్కమయ్యింది మర్రి తొర్ర…
మన్నించరా శంకరా..ఈ మంద బుద్ధిని…
మార్చేయరా ఈశ్వరా..నేనవగ నీ సేవకై కార్యసిద్ధిని….!!ఏమివ్వ!!

పాహిమాం… పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్.

Leave a Comment

Scroll to Top