ఓమ్ నమ:శ్శివాయ నమ:
చల్లని తల్లీ గౌరీ….
శివహృదయ ప్రియంకర శాంకరీ…
అమ్మా జననీ భవానీ…
నీ మంగళ రూపముగాంచి ఈ జన్మము ధన్యమునవనీ..
జయహో..జయహో శాంభవీ…
జయశంకర మానస శుభకరీ….!!చల్లని!!
పరమేశుని మేనిలో సగమై…
నీ భక్తుల పాలిటవరమై…
కురిపించమ్మా ప్రతి ఇంట నీ సౌభాగ్యాల సిరులు…
వినిపించమ్మా ఆడపడుచై నీ గాజుల గల గల ధ్వనులు…
అమ్మలగన్న అమ్మయై నడయాడమ్మా నట్టింట…
పసుపు,కుంకుమలద్దుకొని పసిపాపల్లే ఆడమ్మ ఈ నీ పుట్టింట..!!చల్లనీ!!
నోములు నోచే ప్రతి ఇంటి పడతి…
వినిపింతురు నీకు భక్తితో తమ వినతి…
అమ్మవై అన్నివేళలా తమని ఆదుకొమ్మనీ…
కష్టమొస్తే చెప్పుకొన నీ ఒడిలోన కాస్తంత చోటిమ్మనీ…
అతివలకు ఆరాధ్యదైవమే నీవని…
అబలలను ఆదుకొను ఆదిశక్తివే నీవనీ…
కంటి రెప్పవై కాపాడు జననీ అని…
ముక్కంటి సతివై రక్షించు మాతా అని…!!చల్లని!!
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం….
రక్షమాం..రక్షమాం..హే శాంభవీ రక్షమాం…