ఓమ్ నమ:శ్శివాయ నమ:
త్రిదళ పూజిత త్రినేత్ర హరుడా..
త్రిసంధ్యలూ నిను కొలుచు భాగ్యమ్మునివ్వరా పరమశివుడా..
ఆదిమధ్యాంతమూ లేని ఆదిదేవుడివు నీవయా…
ఈ సృష్టి పరిణామ క్రమానికి మూలకారకుడవు నీవయా…
శంభోహరా శంకరా…హర హరా..
ఉజ్జయినీ పుర విహారీ హర హరా..!!త్రిదళ!!
ఎన్నెన్నో గ్రహరాశులు…
మరెన్నెన్నో జీవరాశులు…
సమృద్ధికర జలరాశులు…
విభిన్న రుచికర ఫలరాశులు…
సర్వ సుందరమైన వృక్షసంపదలు…
కనక,తామ్రమయ ఇత్యాది ఖనిజ సంపదలు..
ఎన్నని తెలుపమయా నీదు బహుమానాలు…
మేమెన్నతరమా శంకరా నీదు గొప్ప గుణ గుణాలు…!!త్రిదళ!!
అందమైన నీ సృష్టిలో పరమాణువులమై మేముంటిమయ్యా…
ఏ పూర్వపుణ్యమో ఈ పుడమిపై పుట్టించినావు నిను మరువమయ్యా…
ధరణిపై తనువు తిరుగాడువరకు…
అవనిపై బ్రతుకు కడతేరువరకు..
గంగాధరా తోడైన,నీడైన నీవేనయా..
శంభోహరా..నిను సేవించ ఈ జన్మ సరిపోదయా…!!త్రిదళ!!
పాహిమామ్..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం…