హరిహరుల ప్రీతికర మాసము…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

హరిహరుల ప్రీతికర మాసము…
ధన్యమగు ధనుర్మాసము…
అభయమూర్తుల శుభకరుణ వీక్షణము…
కనిన తీరు పాప కర్మల ఫలము..!!హరి!!

సుప్రభాతాల వేళలో…
కనులు తెరిచే వేళలో…
వినిపింతుము మృధు మధురముగ వేద మంత్రాల పఠనము…
స్వరమధురిమల సేవతో పులకించి మేల్కోనగ శివకేశవుల  హృదయము…!!హరి!!

మంచు తెరలను దాటి భానుడొచ్చే వేళ లోగా…
చందన తాంబూలాల ఫలములను అర్పించెదము నైవేద్యముగ…
గుడి గంటలు గణ గణగ మ్రోగగా…
మంగళారతులు వెలుగు దివ్వెలవగా…
ముగియాలి తొలిసంధ్య పూజలు…
రవి రాకనే భువిని తాకాలి హారతుల ఉదయ కిరణ రేఖలు…!!హరి!!

పాహిమాం..పాహిమామ్..పరమశివ విష్ణు రూపాయ పాహిమాం..
రక్షమామ్..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top