ఈ రూపానికి అర్ధమేందయా శంకరా…
ఏ రూపాన తెలుసుకుందుమో శెలవియ్యరా…
మా పాపాలను బాపటానికా శంకరా….
మా తలరాతలు మార్చటానికా శంకరా.
పాహిమాం..పాహిమాం..పాహిమాం..శంకరా…
రక్షమాం..రక్షమాం..రక్ష్మమాం..శంకరా..
కనకవర్ణ మేనిలో శంకరా నీకనులు మెరిసేనయా
శివా…
ఆ కంటి పాపలు నీ మాయలో మమ్ము
పడవేసెనయా శివా….
నీ చెక్కిళ్ల పైకెక్కిన ఆ మీసాలు మురిసేనయా
శివా…
మా ఒత్తిళ్ల నెడబాయు దొరవు నువ్వని
చెప్పేనయా శివా….
ఆకట్టుకొని మా మనసు తస్కరిస్తే నువ్వు
దొంగెందుకవుతావు శివా….
పనికట్టుకొని వచ్చి మా వెతలు తీర్ఛిన గత జన్మ
వరమవుతావు శివా….
దక్షిణాయాన పుణ్యకాలము చివరలో నిను
స్మరిస్తూ ఉన్నామయా దక్షిణామూర్తీ…
ఉత్తరాయణ పుణ్యకాలములో కూడా
కొనసాగించవయా శివా…ఇదే స్పూర్తి…
మా అందరి కష్టం నీదంటావుశివా నువ్వు….
మా అందరి దైవం నువ్వంటాము శివా మేము…
మా అండగా ఉంటానంటావు శివా నువ్వు…
మా కన్నుల పండుగ నువ్వంటాము శివా
మేము….
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా
పాహిమాం..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…