ఎంత శ్రమ చేసిరో పుణ్యపురుషులు నిను నేడు దిద్దంగ లింగాన అందముగా…
అంతగా ఎలా ఒదిగావయ్యా గణపతి మా తండ్రిలో.. కనిపించగా భక్తులకు చందముగా…
ముక్కున వేలేసుకొని చూడమా మురిపాల మీ ప్రేమని…
టక్కున పరుగెడిరామా దోచేయగా మీ బంగారు మనసుని….
దాచేయమా మా మది లోన మీ అనుబంధాల చిత్తరువుని….
కొలిచేయమా మాలోన మేము మా దేవుళ్లు మీరేనని…
పాహిమాం…పాహిమాం…పరమేశ్వర పాహిమాం..
రక్షమాం..రక్షమాం..పార్వతీ సుత రూప శివ శంకరా రక్షమాం…
మా కోసమా శివా…రోజుకొక రూపాన సాక్షాత్కరిస్తున్నావు….
మా బాధల్ని తీర్చ మమ్ము ఆకట్టుకొనుటకు నీకు నువ్వే ప్రయత్నిస్తున్నావు…
ఆ కోవలో మేము విఫలమైతే ఇంకో రోజు ఇంకో రూపాన వస్తున్నావు…
వస్తున్నావు…వస్తున్నావు…అలా వస్తూనే ఉంటున్నావు శివా…
చూసి చూడంగానే మమ్ము ఇట్టే ఆకట్టుకుంటున్నావు శివా…
ఆకట్టు కోగానె ఇక్కట్లు తీర్చేవు…
మా ఇక్కట్లు తీర్చేందుకు ఎన్ని రూపాలలో వస్తావయా శివా…
మా కడగళ్లు తుడిచేందుకు నీకెన్ని కష్టా లయా శివా….
వరమియ్యవయా శివా…పుడతాము నీ కోసం ఎన్ని సార్లైనా ఈ భూమి మీద…
కరుణించవయా శివా..చేస్తాము నీ సేవలు కోట్ల సార్లైనా ఈ నేల మీద…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
పలుకరించరా శివా…కలనైనా ఓ సారి సర్వేశ్వరా….