ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు…
మేమెన్ని సేవలు చేస్తె  చాలునో చెప్పవయ్యా…నీ కరుణ పొందేందుకు…
నీ కంటి వెలుగులే మా ఇంటి దీపాలుగా వెలగనీ…
మాహేశ్వరుని వరమునొందిన గృహముగా మహిలోన మిగలనీ..
ఇంతకంటే వరము ఇంకేమీ వలదయ్యా…
నీ చింతలోఉంటే వెతల ఊసుండునా శంకరయ్యా..!!ఎన్ని!!

మ్రొక్కాలనే వుంటుంది పగలనక రేయనక నీ గుడిలోనే ఉంటూ..
పదములొత్తాలనే వుంటుంది సేవకుడినై నీ చెంతనే ఉంటూ..
ఆ భాగ్యామ్ము నెప్పుడిచ్చేవు శంకరా…
ఈ జన్మలో కాకుంటే మరుజన్మలో నైనా కరుణించరా హర హరా..!!ఎన్ని!!

నిత్యమూ నిను చూడ వత్తురేమో దేవతలు…
స్వర్గధామమునుండి పట్టుకొని వత్తురేమో ఫల  పుష్ప  కానుకలు..
కాళేశ్వరునివై వెలసి భువిని దివిని చేశావనీ…
భక్తులను కరుణించ కైలాసమునే ఇలకు దించావనీ…

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top