ఓం నమ:శ్శివాయ నమ:
విచ్చుకున్నావటమ్మా..ఓ పూలకొమ్మ…
వచ్చి వాలిపోవమ్మ పరమేశ్వరుని పాదాల చెంత చూపించు నాతడు నీ పైన ప్రేమ…
ఏ కొమ్మకో దక్కేను ఆ భాగ్యము..
ఆ కొమ్మ నువ్వైతే నీ జన్మ ధన్యము..!!విచ్చు!!
నారు పోసినావాడే..నీరుపోసినా వాడే..
సర్వమూ తానే..సకలమూ తానే..
నింగినేలలను శాసించునతడు…
నిటలాక్షుడతడు..
ఋణపడి ఉన్నాము సకల ప్రాణులమూ సర్వేశ్వరునికి..
సాగిల పడి సేవలు చేసేము..తీర్చుకోవంగ ఋణము పరమేశ్వరునికి…!!విచ్చు!!
ఇచ్చాడు మనకంటూ ఒక జన్మని..
సాగించుకుంటూ మనుగడని సృష్టించుకొనమని పుణ్య చరితని..
ఏ ధర్మమును ఆచరించక ముగిసిపోతే మన జీవితం…
మళ్ళీ జన్మనిచ్చి ఇస్తాడు మనకు ఇంకొక్క అవకాశము..
ఈ తంతు ఇట్లాగే జన్మ జన్మకూ కొనసాగుతుంది…
ఒక జన్మలోనైన తన దారిలో పయనిస్తే ఆ జన్మతో మన పయనమాగిపోతుంది !!విచ్చు!!
పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..