June-2022

ఏ వరమెందుకు ఇక మాకు..

ఓం నమః శివాయ నమః ఏ వరమెందుకు ఇక మాకు..శంకరుడా..పరమాద్భుతముగ నిను కని నాక.. హిమగిరుడా..ఎన్నడూ పొందని భాగ్యము నేడు పొందితిమయ్యా …మేమెన్నడూ కనని నీ దివ్య సౌందర్యమును కని తరించితి మయ్యా….ధరణీ తలము పై వెలసిన దాక్షాయణి హృదయ వల్లభ…శ్రవణా నందమయా…నీ శుభ నామము….హైమావతి మానస సుమ సౌరభా…!!ఏ వర!! సురులు సైతం సాగిల పడి ప్రార్థించు లాగు….మునులు అరమోడ్పు కనులతో అర్తించు లాగు…మూర్తీభవించిన నీ దివ్య స్వరూపమును గాంచి….కీర్తించని హృదయముండునా శంకరా…భక్తితో పరవశించి….శంభో మహా దేవ శివశంకరా..ఏనాటి పుణ్య ఫలమిది మాకు చెప్పరా..గంగాధరా…!!ఏ వర!! ఏమాశిసించకనే ఇచ్చేవు నీ శుభ  దర్శనం…నీ నామ స్మరణకే ఇచ్చేవు ఎవరికైనా మోక్షము ..తొలి జాము నుండి మలి జాము వరకు…తొట్ట తొలి భక్తుడి నుండి చిట్ట చివరి వారి వరకు…చిందించుతూ చేసేవు సుమధురముగ చిరునగవులు..“పునదర్శన ప్రాప్తిరస్తూ” అని ప్రేమతో ఆశీర్వదించి పంపేను నీ పెదవులు…శంభో మహాదేవ శివ శంకరా…ఏ నాటి వరమిది చెప్పరా గంగాధ రా….!!ఏ వర!! పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా…పాహిమాం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా…రక్ష మాం..

ఏ వరమెందుకు ఇక మాకు.. Read More »

తీక్షణ వీక్షణముల్ తగునటయ్య శంకరా…మా పైన..

కోటి బిల్వార్చనలు చేసినా…
శతకోటి పుష్పార్చనలు చేసినా..
తీరునా నీ ఋణము శంకరా…
జన్మలెన్నైతే చాలునయ్య ఈశ్వరా…

తీక్షణ వీక్షణముల్ తగునటయ్య శంకరా…మా పైన.. Read More »

త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…

త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…
త్రిలోక పరిపాలక పరమాత్ముడా…
కనగ రావయ్య..కైలాస గిరి తరుల నొదిలి….

త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా… Read More »

పరమాద్భుతమయా పరమేశ్వరా… నీ దర్శనం…

పరమాద్భుతమయా పరమేశ్వరా… నీ దర్శనం…
వరమాయ మాకు శంకరా…నీ సందర్శనం….
ఏ నోము నోచకనే ఇచ్చావు దర్శనం…

పరమాద్భుతమయా పరమేశ్వరా… నీ దర్శనం… Read More »

Scroll to Top