Author name: Surya Narayana

నన్నెప్పుడూ అడగకయా శంకరా…ఏ వరము కావాలని..

నన్నెప్పుడూ అడగకయా శంకరా…ఏ వరము కావాలని..
ఏమివ్వకున్ననూ నేనెప్పుడూ అడగను ఏంతప్పు చేశానని…
కర్మ ఫలముల కొలదీ ఇచ్చేవు వరములు ఎవరికైనా…

నన్నెప్పుడూ అడగకయా శంకరా…ఏ వరము కావాలని.. Read More »

ప్రణవనాద ప్రియుడు పరమేశ్వరుండు….

ప్రణవనాద ప్రియుడు పరమేశ్వరుండు….
శంఖునాద ప్రియుడు శివ శంకరుండు….
సంగీత సాహిత్యముల సేవలకు సంతసించును శివుడు….

ప్రణవనాద ప్రియుడు పరమేశ్వరుండు…. Read More »

ఇంటికెళ్ళకూడదటయ్యా పార్వతీశా…

ఇంటికెళ్ళకూడదటయ్యా పార్వతీశా…
ఇంకెంత కాలమని ఇచట కూర్చోని వుంటావు ఉమా మహేశా….
వల్లమాలిన ప్రేమెందుకో నీకు వల్లకాటిపై…

ఇంటికెళ్ళకూడదటయ్యా పార్వతీశా… Read More »

దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు….

దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు….
ప్రతిజ్ఞ బూని చేసెద పరమేశ్వరా…నీ సేవలు….
అవరోధములెన్నున్న ఆపనయ్య వ్రతములు….

దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు…. Read More »

కొలవని వారెవరు శంకరా…నిను ఈ పుడమిపై…

కొలవని వారెవరు శంకరా…నిను ఈ పుడమిపై…
అసలు తలవని వారెవరు హర హరా ఈ నేలపై…
నిముష నినుషమూ పలుకుతుంటే మా మది నీ నామము…

కొలవని వారెవరు శంకరా…నిను ఈ పుడమిపై… Read More »

ప్రణవ నాద ప్రియ పరమేశ్వరా…

ఓం నమః శివాయ నమః  ప్రణవ నాద ప్రియ పరమేశ్వరా…కరుణ కోమల కనుల కాళేశ్వరా…అనితరసాధ్యము నీ దర్శనమను మాట సరికాదట…ఆర్తితో కొలుచు వారెవరికైనా దర్శనము నీవు ఇచ్చేవట…కలనైన నిను కనగలిగితే చాలు కరుణాకరా…కామితార్థములనియ్య కదలి రావయ్య శివ శంకరా…!!ప్రణవ!! ఎదురు చూచి చూచీ కనులు ఏమనెననో తెలుసునా….నిదుర పోనే పొమ్మన్నవి చూడు వరకూ నిటలాక్షుడి నీడనైనా…ఓదార్చలేకున్నాను శంకరా…నా కనులని…ఆపలేకున్నాను ఈశ్వరా…అవి రాల్చు జలముని…ధారలై పారుతూ తాకనీ నీ పాద పద్మాలనీ…అవి గంగలా మారి నువు స్నానాలు ఆడితే చాలు మరుజన్మ ఇంకేలని…!!ప్రణవ!! మనసు నిర్మలమవును మాహేశ్వర నిను కనినచో…తనువు పరిణితి నొందు భక్తి మీరా శివ శివా అని నిను అనినచో…నీ తలపుల తటాకము లో తామరై పూయాలనుంది….నిరతము నిను కొలుచునటుల గుండెని గుడిగ చేయాలనుంది….అరక్షణము ఆశీనుడవైతే చాలురా నా హృదయ పీఠానా….ఈ జన్మ ధన్యమైనటులే కదరా సూర్య చంద్ర నయనా…!!ప్రణవ!! పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా…పాహిమాం.రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…

ప్రణవ నాద ప్రియ పరమేశ్వరా… Read More »

Scroll to Top