ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఇచ్చావు శంకరా దర్శనము…మాపైన దయచూపగా..
కమలనేత్రాలతో లోకాన కరుణ కురిపించగా…
ఎన్ని వెన్నెలలైతే సరిపోవునయ్యా నీ చిరునగవుకి…
ఎన్ని మధుపములైతే సరిపోవునయ్యా…నీ ధర హాస మధురిమలకి..
సుందర సుకుమార సౌందర్య సార్వభౌమా…
భక్తి పారవశ్యమున నిను గాంచి మా మదిని నీకర్పించుకొనమా..!!ఇచ్చావు!!
కదలునా కాత్యాయినీ అయినా నిను గాంచి నాక…
తాను కీర్తించకుండునా భక్తజన మది మందిరాలలో నీవు నిలిచినాక..
మాస్వామి..కానే కాదు..నాకు నాకే స్వంతమని..
ఈ స్వామి హృదయాన ప్రియమైన భక్తులకూ చోటు ఉంటుందనీ..
నీ వామహస్తము వైపు చేరి వరములియ్యదా…
ప్రేమ నయనాలతోచిరునగవు చిందిస్తు నిను పరికించి చూడదా..!!ఇచ్చావు!!
ఆశీనులై ఇద్దరూ అభయహస్తములతో వరములిస్తుంటే…
ఆది దంపతులై ముజ్జెగములా అలరారుతుంటే..
ధగ ధగా మెరిసిపోవా దివిసీమలన్నీ..
కదలి రారా బిరబిరా గంధర్వులు కీర్తించుతూ మీ ప్రేమానురాగాల గీతిని…!!ఇచ్చావు!!
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..