వేస్తుంటే నేను…ఏ తప్పటడుగైననూ..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

వేస్తుంటే నేను…ఏ తప్పటడుగైననూ..
చూస్తూ ఊరుకోకయా..ఎంత నీ భక్తుడనైనను…
వారించరా శంకరా…కనిపించక
నివారించరా శంకరా..క్షణమైన ఆగక..!!వేస్తుంటే!!

పాప పుణ్యాలెరుగని బడుగు జీవులము మేము…
పుణ్య పురుషార్ధముల నెరుగంగ ఒక్క అడుగైన వేయలేము…
అసూయా, ద్వేషాలు ఆస్తులైనాయి..
ఆధ్యాత్మిక భావాలు నిండుకున్నాయి…
మనసు మాట నేను వినను పొమ్మన్నప్పుడు..
సాటి మనిషిలో నిను నేను కనలేని నప్పుడు..!!వేస్తుంటే!!

ఆర్జించడమే ముదమాయే..
సమర్పించడమే బరువాయె..
కూడబెట్టుకొని పట్టుకొని పోలేమన్న సత్యమును మరచి…
వెంటరానట్టి రక్త సంబంధాల కొరకు సమస్తమును దాచి..
పరుగాపక ఆశగా పయనించునప్పుడు..
ఆ పయనాల గమనాలలో నేను గతి తప్పినప్పుడు…!!వేస్తుంటే!!

పాహిమాం.. పాహిమాం.. పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top