ఓమ్ నమ:శ్శివాయ నమ:
కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు…
చల్లనీ మల్లన్నా…మల్లెమాలలకన్న, మధుపముల కన్న మధురమైనది చింతలను బాపు నీ సన్ననీ చిరునగవు…!!కని!!
కరుణరసాధార ధరహాసము…
నీలి నేత్రాల వెలుగు వెన్నెలల నీ తేజము..
పోశాయి సృష్టికే ఊపిరి…
కాలమానాన కురిపించి తొలకరి….!!కని!!
ఏ పూర్వ పుణ్యమని ఇచ్చావయా మాకు ఇన్నిన్ని దర్శనములు…
ఏ నోము నోచామని తెరిచి కూర్చున్నావు మదిలోన… మా హృదయ ద్వారములు…
నిటలాక్షుని నిలయమయ్యాక మా దేహము…
ఏటికెదురీదినా కలుగునా.. ఏదేనీ ప్రాణభయము…
కాళుడే కలిసి ఉంటాడని కాపాడగా కనిపించక…
ఆర్యులంటారు…ప్రక్కనున్నా పరమేశ్వరుడు వున్నట్లు తోడుగా…అనిపించక..!!కని!!
పాహిమాం…పాహిమాం…పార్వతీశా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..గౌరీ మహేశా రక్షమాం…