ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం….
ఈ జన్మ పావనం…శివకేశవ స్వరూప సందర్శనం…
అనురాగ మూర్తులైన ఈ హరిహరులు….
ఏకమై ఏతెంచినారు అందించగ అందరికి దీవెనలు…!!ఎంతో!!
తరలిరండి…తరలి రండి…భక్తులారా ఏకబిగిన తండోపతండాలుగా…
పదము కలిపి కలసిరండి పరమాత్ముల గాంచి పరవశాన వేడుకొనగ మనసు నిండుగా..
ఎన్ని జన్మలెత్తితే దొరకును మనకు ఈ పుణ్యక్షణములు…
ఏక కాలమున మనము పొంద శివ విష్ణు స్వరూపముల శుభ వీక్షణములు…!!ఎంతో!!
హరిహరాదులిద్దరూ అభయమూర్తులు..
ఎవరి దయ పొందినా సరే… వారు ధన్య చరితులు…
పలుకుతుంటే చాలు నారాయణుని అష్టాక్షర మంత్రం…
చదువుతుంటే చాలు…పరమేశ్వరుని పంచాక్షరి మంత్రం…
నేలపై ఉన్నామన్న మాటనే మరచిపోయేము…
ఒకరమిద్దరై..నింగికి ఆవలున్న కైలాస,వైకుంఠ దివ్య ధామములు చూసేము..!!ఎంతో!!
పాహిమాం..పాహిమాం..హరిహరస్వరూపా
రక్షమాం..రక్షమామ్…శివకేశవ స్వరూపాయ రక్షమాం…