ఓమ్ నమ:శ్శివాయ నమ:
శంభో శంకర మహాదేవ.. సాంబ సదా శివ గురుదేవా…
హర హర శంభో మహదేవా..
శివ శంకర శంభో గురుదేవా..
ఏ పూజలు చేశామని ఇచ్చేవయ్యా.
అనుదినమూ నీ దర్శన భాగ్యము శివయ్యా…
చేసిన సేవలు నీకు గోరంత…
నువ్విచ్చే ఫలములు మాత్రం కొండంత…!!శంభో!!
గుండె బరువుతో వస్తామయ్యా నీ గుడిలోనికి…
నిను దర్శించుకొని గుండె ధైర్యముతో వెళతామయ్యా బయటకి…
నిలుచుందేమో నీ ముందు క్షణమే అయినా…
ఇచ్చిపంపేవు సరిపడా ఆత్మస్థయిర్యమును ఆరునూరైనా..
బ్రతుకు సమరాంగణమున పోరాడగా..
తీర్చిదిద్ది పంపేవు బంటునైనా సేనాధిపతిగా…!!శంభో!!
నిను దర్శించినాక కనిపించదు ఏ కనులలో నైరాశ్యమూ…
దీవెనలు పొందాక ప్రతి భక్తుడూ కోరేను ఇమ్మంటూ పున:దర్శనభాగ్యము అవశ్యము…
రావాలనిపిస్తుంది పదే పదే నీ గుడి ప్రాంగణమునకు…
వచ్చి చేయాలనిపిస్తుంది మరి మరీ గంగతో అభిషేకములు నీ లింగమునకు….!!శంభో!!
పాహిమాం..పాహిమామ్..శివశంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…అభయంకరా రక్షమాం…