ఓమ్ నమ:శ్శివాయ నమ:
విశిష్ట వానరము వేలుపాయెను నేడు….
కాళేశ్వరునిగా పూజలందుకొని అంజనీ సుత హనుమంతుడు…
ఎంత భాగ్యమిస్తివయా హనుమకి…
రామ నామ జపతపములే ఊపిరైనట్టి హనుమానుకి..!!విశిష్ట!!
భక్తి విలువలను లోకానికి తెలియజెప్పి…
భక్తితో భగవంతుని సైతమూ వశపరచుకొనవచ్చునను సత్యమును చూపి…
మార్గదర్శకుడాయెను మారుతీ…
దైవ హృదయ దార్శకుడాయెను శ్రీ మారుతీ…!!విశిష్ట!!
రామచంద్రుని పై భక్తిని చాటగా హనుమంతుడు…
తనగుండె చీల్చుకొని చూపించె కొలువున్న శ్రీ రామచంద్రుని వానరాగ్రేసరుడు…
ఎనలేని ప్రేమతో రామయ్య హనుమయ్య ఆనందభాష్పాలు తుడిచి..
వర్ధిల్లమని దీవించె చిరంజీవివై ఎన్ని యుగాలైనా ఈ భువిపైన నిలిచి…
అర్హుడే కదా శంకరా నీకు జరిగే పూజలను అందుకొన ఆంజనేయుడు…
తన బలమెంతో తనకు తెలిసినా ఒదిగుండు గుణవంతుడు… మహా బలవంతుడు…!!విశిష్ట!!
పాహిమామ్..పాహిమామ్.. శివశంకరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్….శివహృదయ స్థాన నివాస ఆంజనేయాయ రక్షమాం…