ఓమ్ నమ:శ్శివాయ నమ:
అందుకో…..అందుకో….అందుకో..
మా తొలి సంధ్యల పూజలివే పుచ్చుకో భవహరా…
నిలిచిపో…..నిలిచిపో…నిలిచి
మా మాటలలో..మనసులలో నిలిచి ఉండిపో ఈశ్వరా…పరమేశ్వరా…
శంభో శంకర.. శంకర మహాదేవ…
సాంబసదా శివ.. శివ శివ శంకర గురుదేవా…!!అందుకో!!
కలలు పండినటుల..
కనులముందు నువ్వుంటే…
భక్తి కవితలల్లి నీకు సేవ చేయనా…
అలలు ఎగసినటుల…
మనసు ఉప్పొంగుతుంటే…
మందార మకరంద సుమ మాలలేయనా..
చెప్పరా..శంకరా నా మదిని శృతి చేయగా…
పెదవిప్పరా శంకరా..మనసార నీ కృతిని పాడగా…!!అందుకో!!
ఆశ తీరదట శంకరా…మా కనులకు..
పలు పలుమార్లు దర్శించినా తన కంటి రెప్పలకు….
అలుపురాదట ఈశ్వరా…మా తనువుకు…
నీకెన్ని సేవలు చేసినా తనువు చాలించు వరకు…
అనీర్వచనీయమైన భక్త్యానురాగాన్ని పొందాలని…
అభేధ్యమైన నీ మానస మందిరమున సుస్థిర స్థానమును పొందాలనీ…!!అందుకో!!
పాహిమాం…పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం…రక్షమామ్..సర్వేశ్వరా