ఓమ్ నమ:శ్శివాయ నమ:
కానరావమ్మ పరమేశ్వరునీ సతీ..
వేచివున్నాడమ్మ మా చిన్ని గణపతీ..
పూజలందుకొని తల్లి దీవెనకై…
ప్రేమ మీరాతీయు నీ దిష్టి హారతికై…!!కానరావమ్మ!!
లోకబాంధవుడు ఏకదంతుడు నేడు..
ముచ్చటాయెనోయేమో పిలిపించుకునే నీ విభుడు…
తనివితీరా తనయుని గాంచి…
తన హృదయస్థానమును పంచి..
పరవశించేనమ్మ పరమశివుడు
దివ్యయోగము కుమరునికి ఇచ్చిహరుడు…!!కానరావమ్మ!!
అలసిపోయినట్లున్నాడు గజానన నందనుడు…
ఆరగించి, ఆరగించి భక్తులొసగిన నైవేద్యములు మూటెడు…
ఆ చందమామ కన్ను నీ కన్నయ్య పై పడకుండ..
కొంగు చాటేయమ్మ మా గణపయ్య తన కంట పడకుండా..!!కానరావమ్మ!!
పాహిమామ్..పాహిమామ్..పార్వతీ నందనా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..శ్రీ గణనాధాయా రక్షమాం..