ఓం నమశ్శివాయ…హర ఓం నమశ్శివాయ…

ఓం నమశ్శివాయ…హర ఓం నమశ్శివాయ…
రుధిరనేత్ర రుద్రరూప సాంబశివా నీ దర్శనం…సర్వపాప భయహరం…
ఫాలనేత్ర త్రిదళమూర్తి మహాశివుని వీక్షణం…సకల పాప వినాశనం…
జజ్జనకర..జజ్జనకర..ఝటా ఝూట ధరారి…
నీ పద గజ్జెల సవ్వడి తో ముజ్జెగములు అలరారె…
శంభో హర..శంభో హార..శివ..శివ..శివ..శంభో…
గంగాధర..గౌరివర హార..హార..శివ..శంభో…

రారా శివ..రారా శివ..నర్తించుము మము కావగ ఇల జన మనో వేదికపై…
కదలి రారా శివ..మాలో గల అత్యాశల అసురుల తుదముట్టించగ మా కోరికపై..

ఆగ్రహించి చూడకలా తల్లడిల్లును లోకము..
అనుగ్రహించి చూడు శివా ప్రాణమిల్లును మా కనులనేకము…
ధూపదీప నైవెద్యాలు నీ చూపుకే…
మా మనో మందిరాన ఉంచినాము నీ సేవకే…
మేమెరుగకనె స్వీకరించు ప్రభూ ప్రేమతో…
నిన్నడగకనే స్మరింతునందయా శివా మది భక్తి తో..
పాహిమాం..పాహిమాం..సాంబశివా…
రక్షమాం..రక్షమాం..మము దయకనవా…  

Leave a Comment

Scroll to Top