సుందర రూపాన శివశంకరుని కని..
మది తానన్నది వందనమిది గైకొనుమా అని…
ఎల్లలు లేని ప్రేమే పరమేశ్వరునిదని…
పొంగెను తాను పుణ్యజన్మను పొందెను నేనని…
కనరా శివా..మా మది నీ కైలాసము..
కావాలన్నది తను నీ స్థిర
నివాసము…
సుగంధ ద్రవ్యములతో సుందరముగ తీర్చిదిద్దారు నేడు సుజనులు…
సుమధుర తీపి వంటకములు నేడు నైవేద్యమిచ్చిరి భక్త జనులు…
పరిమళములను ఆఘ్రాణించి పరవశించరా…
మధురిమలను ఆస్వాదించి కరుణించరా…
నిను సదా ప్రసన్నముగ కాన మేమిరిగిన మార్గము ఇదే శివా…
నువు సదా తోడుంటే వేరే స్వర్గము ఏల శివా…
మూడు కళ్ల శివుడు నేడు చూడ ముచ్చట….
పక్కన లేదాయే సఖి? పార్వతెచ్చట?
ఆడరావమ్మ కాత్యాయినీ ముద్దు ముచ్చట…
తన మనసే నీకు తాను కానుకిచ్చట…
చాలవు కదా తల్లి..రెండు కళ్లు మిమ్ము చూడగా…
వేయిజన్మలెందుకమ్మా ఈ ఒక్క జన్మ చాలుగా…
మా కనులు మిమ్ము కానగా..మా కంట గంగ పారగా…
మీ పాదాలు తాకదా…భక్తి భావనలు ఉప్పొంగి మీ కాళ్లు కడగదా…
పాహిమాం…పాహిమాం..పాహిమాం..పార్వతి పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..రక్షమాం…ఉమామహేశ్వర రక్షమాం…