త్రినేత్రా…త్రిలోక పరిపాలకా…

కైలాసగిరినొదిలి కదలిరావయ్యా…

త్రినేత్రా…త్రిలోక పరిపాలకా…

నీ మీద గురి కలిగి నమ్మి ఉన్నామయా..

మహాకాళా…జగమేలు గణనాయకా…

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..

రక్షమాం..రక్షమాం…జగదీశ్వరా…

ఏ కష్టమొచ్చినా ఈ సృష్టి లో ఆదుకొను వాడు

 ఒక్కడేనని…

ఎంత సంక్లిష్టమైనా క్షణములో కడతేర్చు

 వాడతడేననీ…

ఆతడెవరో కాదు…అధినాయకుడు

 ఆదిశంకరుడివి నువ్వేననీ…

బ్రహ్మ విష్ణాది దేవతలు తెలిసి      

వేడుకున్నారనీ…

యుగయుగాలుగా జగమెరిగిన నగ్న సత్యమిది

 శివా…

తర తరాలు గా అంతరంగాల లో పొంగుతున్న

 ఉద్విఙ భావమిది శివా…

కాదనకయా శివా కలిసిఉండిపో మాతో…

ఎన్ని జన్మలైనా ఉంటాము నిను స్మరిస్తూ నీతో…

పాహిమాం..పాహిమాం..శివా…పాహిమాం..

రక్షమాం…రక్షమాం…శివా…రక్షమాం..

Leave a Comment

Scroll to Top