ఓం..భస్మ కాళేశ్వరా..వీర భద్రేశ్వరా..

ఓం..భస్మ కాళేశ్వరా..వీర భద్రేశ్వరా..
ఓం..రుధిర నేత్రేశ్వరా..ఉగ్రరూపేశ్వరా..
చాలించు..చాలించు..శివా  
నీ ఆగ్రహావేశాన్ని..
కరుణించి..చూపించు శివా…నీ ప్రేమస్వరూపాన్ని…
విల విలలాడి పోయేను శివా..విశ్వమంతా భీకర నాదాలతో..
అల్లాడిపోయేను శివా…లోకమంతా
హా హా కారాలతో
పతిత పావన మూర్తైన పార్వతీశా…
బాధాసర్ప ద్రష్టులయందు దయ కనరా జగదీశా…
తక తకిట తక తకిట
తాండవశ్శివాయా శంభో హరా….
ధి తక్కిట ధి తక్కిట ఆనందశ్శివాయవై రారా హరా…
ప్రజ్వలిత ప్రళయ నృత్యేశ్వర శివ పాహిమాం…పాహిమాం…
గంగాఝరీ ఝఠర జగదీశ్వరా శివా రక్షమాం…రక్షమాం…
గౌరీ మనోహర శివ ప్రియ పాహిమాం…పాహిమాం..
మా గర్వమణచి గమ్యాన్ని చూపి మము రక్షించవయా శివా…రక్షమాం..రక్షమాం..

Leave a Comment

Scroll to Top