ఓం..నాగేశ్వరా శివం నమో..నమో
ఓం..సర్వేశ్వరా శివం నమో..నమో
ఓం..ఫణిభూషణా శివం నమో..నమో
ఓం..పద్మనేత్రాయా శివం నమో..నమో.
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..
నీ భక్తి పద పంక్తులను పలుకు వరమియ్యరా…విశ్వేశ్వరా…
ముని రూప ముక్తేశ్వరా నీ
మందస్మిత నగుమోము కని మా కలలు ఫలియించెరా…
పార్వతీ హృదయేశ్వరా వివిధ వర్ణాల విరుల పూజలతో నిను చూడ భక్తి భావనలు పెల్లుబికెరా…
మాట పెగలని భక్తి ఉంది శివా మాలో…
పాటగా రాని ఆర్తి ఉంది శివా లోలో…
మా భక్తిలో మాటల భావాలను తెలుసుకోవయ్య…
మా ఆర్తిలో పాటల రాగాల్ని వినిపించుకోవయ్య…
భావము లో భేదాలున్నా…
రాగములో దోషాలున్నా…
మన్నించవయా శివా…
మనసు లోతుల్లోన మణిమందిరాన నీ రూపమే గమనించవయ్యా శివా…
పూజించుకుంటున్నాము నిత్యమూ మౌన ప్రార్ధనలతో…
కొలుచుకుంటున్నాము పలునామ స్వరూపాలతో…
పాహిమాం…పాహిమాం…పాహిమాం..శివా..
తీపి తేనెల నీ దివ్య తీర్థాలు మా కివ్వరా శివా…