దినమొక రూపము నీ దివ్య దర్శనము..

దినమొక రూపము నీ దివ్య దర్శనము..
మా కనులకిది యోగము నిత్య సందర్శనము…
ఎంతవరమొందితిమోనయా శివా…నిత్యమూ నినుకన పలు రీతిన..
మాకెంత భాగ్యమోనయా శివా…ప్రతి నిత్యమూ చేయగా నీ ఆరాధన…
ఈ రీతిన మము దయగనిన పరమేశ్వరా….
ఏ రీతిన ముదమవగలమో శలవియ్యరా….
పాహిమాం..శివా..పాహిమాం..పాహిమాం…
రక్షమాం..శివా..రక్షమాం..రక్షమాం…

అలసిపొయివుంటావు కదా శివా..రోజంతా అందరి బాధలు వినివిని…
మనసు కరిగిపోయి వుంటుంది కదా శివా…మా అందరి గాధలు తెలుసుకొని…
విశ్రమించవయా శివా కాసేపు..మా హృదయతల్పముపై శయన శివునివై…
సేదతీరవయా శివా… పొద్దు పొడిచె లోపు… పరమేశ్వరా పసిపాపవై…
జోల పాడేము నీకు నిదురించరా శివా..
సడి చేయకుండా శయనించరా శివా..
పదములొత్తేము నీకు పవళించరా శివా…
నీ పుణ్య పాదాలు కందితే మన్నించరా శివా…
నీ సేవలో తరియించు ఈ తనువుకి..
ఇంతకన్నా ఏం కావాలి శివా ఈ జన్మకీ..
ధన్యోశ్మి శివా…ధన్యోశ్మి…
కైలాసవాసా…మనసాస్మరామి..

Leave a Comment

Scroll to Top