నీ ఫాల నేత్రమున సాలె గూడులా ఆ ఆహార్యం…

నీ ఫాల నేత్రమున సాలె గూడులా ఆ ఆహార్యం…
నీ ప్రియ భక్తుని గా ఆ స్థానాన్ని పొంది నీ నుదుటన చేరిన ఆ పురుగు జన్మ ధన్యం…
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..వాయులింగేశ్వరా రక్షమాం…

శతాబ్దాలు గడచినా మరువలేని చరిత తనది…
సహస్రాబ్ధాలు దాటినా తిరిగి రాయలేని ఘనత తనది…
పరిమాణం లో చిన్నదే అయినా…
పరిపక్వత లేని జీవమే అయినా…
బంధించుకొనెనయా శివా నిన్ను.. తానల్లుకున్న గూటిలో పదిలముగా…
భావించుకొనెనయా శివా నిన్ను…తన గుండె గుడిలో దైవముగా….
సూక్ష్మమైన కీటకం నీ సేవలో తరించి మోక్షమే పొందిందయా శివా…
మోక్షానికి సూక్ష్మమైన మార్గాన్ని చూపి సకల ప్రాణికోటికీ ఆదర్శమైందయా శివా…
ఆద్యక్షరమై నిలిచే “శ్రీ కాళ హస్తి” లోన “శ్రీ”గా…
అంతర్లీనమైన క్షేత్రనామము తో  వెలిసె ఇలలోన స్థిరముగా…

🙏

Leave a Comment

Scroll to Top