శ్రీ రామ భక్త హనుమ నీలోన ఉద్భవించగా కనువిందాయా శివా…
భక్తి పారవశ్యము తో నీ మదిని గెలుపొందిన తనకు సాటి ఎవరయా శివా…
వానరాగ్రజుడు పూజార్హుడై చేరాడు శివా నీ పాదాల చెంత…
స్వామి భక్తి పరాయణుడు పవన సుతునికి చెందనీ శివా ఫలము కొండంత….
సద్గుణ సంపన్నులతో సాంబ శివుని సాంగత్యానికి ప్రత్యక్ష నిదర్శన పావన రూపమిది శివా….
భగవంతునిపై అచంచల విశ్వాసముంచిన ఆత్మీయతకు సదృశ్య రూపమిది శివా….
నరుడైనా,వానరుడైనా నీ కృపకు పాత్రు లైతే దొరుకును కదా శివా..నీ హృదయాన కాసింత చోటు…
కలనైన,మెలకువలోనైన మరువక నీ సేవలో తరిస్తే ఉండదు కదా శివా ఏ ప్రాణికీ ఇలపైన దేనికీ లోటు….
ఆనతివ్వు శివా…సన్నద్దమవుతాము సంహరించగా మాలోని దుర్గుణములు…
అభయమివ్వు శివా…ఆచరించేము మహోన్నతులమవుటకు సత్యధర్మ వ్రతములు…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం….
రక్షమాం…రక్షమాం..రామ భక్త హనుమ ప్రియ శివం…రక్షమాం…
.