శివాయ…శివాయ..శివ శంకరాయ…

శివాయ…శివాయ..శివ శంకరాయ…
విన్నవించనీ మా మనవి విశ్వేశ్వరాయ.
రోజూ ప్రశ్నార్ధకములే శివా నీ దివ్య అలంకరణములు…
భావమేమిటో తెలియని జవాబులు నీ భూషణములు…
కనులారా దర్శించగలము శివా…
మనసారా స్మరించగలము శివా…
మర్మమడిగితే మాట రాని మౌన మునులమయ్యా శివా…
తర్కించమంటే చెప్పలేని మూగ జనులమయ్యా శివా…
సందేహాల దేహానికి తీరని దాహంలా.. మాలో..
ఉండిపోనీకయా శివా…ఆ ఆంతర్యము తీరని కోరికలా లోలో…
నీ ఆరాధనా పరిశోధనలలో మునిగి పోనివ్వు శివా…
ఆధ్యాత్మిక లోతుల విశ్లేషణ లో పండిపోనివ్వు శివా….
మానవులమని మరచిపోనివ్వు శివా…
మహోన్నతులమై రాటు తేలనీ శివా…
అందమైన ఈ సృష్టి సంపూర్ణ స్వరూపాన్ని మా అంతరాత్మ తో చూడనీ శివా…
సృష్టి స్థితి లయకారుడు పరమేశ్వరుడే పరమాత్ముడని ఈ లోకానికి మము చాటనీ శివా…
ఆ బాట లోనే మము నడవనీ శివా…
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….
రక్షమాం…రక్షమాం…లోక రక్షకా రక్షమాం…

Leave a Comment

Scroll to Top