లింగమా? ప్రత్యక్ష రూపమా?

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

లింగమా? ప్రత్యక్ష రూపమా?
జంగమా…నిజమేదో చెప్పుమా?
నమ్మకున్నవి ఈ రూపమును మా కనులు రెండు…
ఇదే నిజరూపమైతే చాలు…మా కలలు పండు..!!లింగమా!!

పరి పరి విధముల సాక్షాత్కరిస్తూ..
మా హృదయ ఫలకము పై నీ ముద్ర వేస్తూ…
నీ దైన శైలిలో నీ మాయలో పడవేసి…
మా జీవన శైలినే అద్భుతముగ మార్చి వేసి…
అర్ధాన్ని తెలిపేవు జన్మకు…
జన్మ పరమార్ధమిదని గ్రహించమని తెలిపేవు మనసుకు…!!లింగమా!!

భావ గర్భితమైన రూపాన ప్రకాశించుతూ…
భవ బంధ భారములను మరిపించుతూ…
భక్తి భావోద్రేకములను మాలోన కలుగజేస్తూ…
సత్యధర్మవ్రతులుగ మసలమని తెలియజేస్తూ….
అర్ధాన్ని తెలిపేవు జన్మకు…
జన్మ పరమార్ధమిదని గ్రహించమని తెలిపేవు మనసుకు…!!లింగమా!!

పాహిమామ్..పాహిమాం… పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం.. రక్షమాం.. సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top