ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు…

ఓం నమః శివాయ నమః 

ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు…
వెలుగు పంచంగ ప్రకాశించే ఈ సృష్టికే సూర్యుడు…
ఎనలేని శక్తి నివ్వంగ సకల జీవరాశుల లెల్లకు…
యుగ యుగాలుగా పరిభ్రమిస్తూ ఉన్నాడు నీ ఆన మేరకు…!!ఉద!!

అలుపన్నదే కనలేదు రవి మోము లోన…
కాలగమనము గతి తప్ప లేదు నీ కరుణ వలన….
అందాల నీసృష్టికి సొగసే కదా సౌర సొబగుల తాకిడి…
అచంచలమైన నీ ప్రేమకి శిరమొంచదా జగము ఋణపడి…!!ఉద!!

ఎన్నెన్నో ఇచ్చావు జగతి మనుగడ కోసము…
ఇంకేమైనా ఇచ్చేవు కోరితే భక్తితో ఈ జగము కోసము…
ఏ లోపాలు లేనట్టి అత్యద్భుతమైన నీ సృష్టిలోన…
అల్పులము మమ్ముంచినావయ్య మన్నించి సూర్య చంద్ర నయనా….
ఎన్నగలవారమా శంకరా..నీ కీర్తిని..
లెక్క కట్ట గలవారమా..నీ కరుణని…
!!ఉద!!

పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం.  
రక్షమాం.. రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top