ఓమ్ నమ:శ్శివాయ నమ:
చల్లని తల్లీ శ్రీ జననీ
మము చల్లగ చూడుము శివ హృదయినీ…
ఎల్లలు లేని నీ దయని…
కురిపించుము తల్లీ ఇది నీ అవని…!!చల్లని!!
పువ్వులు,గాజులు, పట్టెడు కుంకుమ నీ పూజకు మేము తెచ్చామమ్మా…
నీ చిరునవ్వుల వరముల మూటలు ఇస్తే భక్తితో పట్టుక పోతామమ్మా…
నీ మంగళ హారతులద్దుకొని…
శుభ మంగళ గీతము పాడుకొని..
మురిసేమమ్మా మృధు నయనీ…
నీ పదములు తాకిన పువ్వును జడలో తురుముకొని…!!చల్లనీ!!
కాళ్ళకు పసుపు, నుదుటన కుంకుమ బొట్టు…
ముత్తయిదువ ఆశల కోర్కెల తొలి మెట్టు…
రక్షించే తల్లివి నీవని..
పరిరక్షించే మనసే నీదని…
నోములు నోచే పడతులకు…
వ్రతములు చేసే అతివలకు…
అమ్మవు నీవై, అండవు నీవై ఉండమ్మా…
ప్రేమను పంచె పాశము నీవై నిత్యం తోడుగ ఉండమ్మా…!! చల్లని!!
పాహిమామ్..పాహిమాం..పరమేశ్వరీ పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..శివశాంకరీ రక్షమాం..