మనసాగనంది మహాశివా…మనసాగనంది..

మనసాగనంది మహాశివా…మనసాగనంది..
పది పదములైనా  భక్తితో నీకు నేను వ్రాయకుండా…
పది భక్తి గీతికాలతలైనా నీకు నేనల్లకుండా…
మనసాగనంది శివా…మనసాగనంది…

ఏముందో ఏమో నీ మోములో తెలియదాయే….
ఓ సారి తిలకిస్తే మది నిలువదాయే….
భక్తి పరంపరలు పెల్లుబుకు మా మేని లోన…
శక్తిమేర నీ సేవలు చేయాలన్న
తపనలువ్విళ్లు తనలోన…
అద్దం లో నిను నువ్వు ఓ సారి చూసుకో శివన్నా….
నువ్వైన నీ మాయలో పడక తప్పదన్న…
కరుణ నేత్రాలతో చూడ చక్కనైన శివయ్య….
నిన్నేంత మ్రోక్కినా మా దృష్టి లో అది తక్కువేనయా…

Leave a Comment

Scroll to Top