ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ…
ఏపేరు పెట్టము…మా మీద చూపిస్తున్న నీ కరుణకి…
శంభో మహాదేవ…శివశంకరా…
నీకు ఎంతో దయవుంది మాపైన అభయంకరా!!ఎందు!!

భక్తిభావాలు మాలోన పెల్లుబుకుతుంటే…
నీ దివ్యశ్లోకాలు ఒకటొకటిగా రాగముగ పలుకుతుంటే…
కళ్ళెదుటె కనిపించు  కైలాసము…
హిమనగపు పీఠము పై గౌరమ్మ తో కలిసి కూర్చుండి ఆలకిస్తూ.. చేస్తున్న చిద్విలాసము….!!ఎందు!!

క్షణము నీ ఎదుటనే కూర్చుండి వీక్షిస్తుంటే చాలు….
పలుకు పంచాక్షరీ మంత్రాలు మాలోన వేనవేలు…
మనసు నీధ్యాసపై పెట్టి ఏకాగ్రతగ  కొలిచితే చాలు…
మేమవ్వమా నీ పూజకై పూచిన మందార పూలమై తొలగి మా గత జన్మ పాపాలు…!!ఎందు!!

పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top