ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…
తీర్చగ రావయ్య వేగిరముగ గిరిజా ప్రియపతీ…
విన్నవించుటెట్లనో తెలియకున్నది మాలోని…వేదన…
నీకు వినిపించుటెట్లనో అర్ధమవకున్నది మా మనో వేదన..!!ఏదో!!

ఇవ్వాలయా శంకరా…మహత్తర శక్తి మా హృదయానికి….
ఆటుపోట్లెన్ని ఎదురైనా తట్టుకోగల మహోజ్వల శక్తి మా తనువుకి….
కష్తమొస్తె చాలు అయిపోతాము…కన్నీటి పర్యంతము…
నష్టమేది జరిగినా ఓదార్చుకోలేము మము మేము జీవితాంతము….
ఆత్మస్థైర్యమునిచ్చి ఆదుకొనవయ్యా…
హృదయాంతరంగమున చేరి ధైర్యమ్మునియ్యవయ్యా…!!ఏదో!!

ఆచరిస్తూ నీ పూజా విధులనూ, వ్రతములను….
నిర్వహిస్తూ భక్తితో నీ యజ్ఞ యాగశాలలను….
త్రికరణ శుద్ధిగా నీ సేవలో మునిగితే చాలు కదటయ్యా….
కర్మానుసారముగ కలుగు ఫలములెన్నైన కలలాగా కరిపోవా శివయ్యా…
ఈ సత్యమెరుగని మనిషి తెలుసుకోలేకున్నాడు తనలోని వెలితి….(ni)
జవసత్వములుడిగినపుడు పట్టుకుంటున్నాడు శంకరా…దిక్కునేవేరా అంటూ నీ కాళ్ళు (kaallani) పశుపతీ…!!ఏదో!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top