ఓంకారమే మా తొలి అక్షరమై…

ఓంకారమే మా తొలి అక్షరమై…
సంగీతానికి అది బీజాక్షరమై…
అలరారె..శివా..అవనిపై నీ ప్రణవ నాదమై…
ఇల నిలిచి పోయే శివా…పరమ పావన శబ్దవేదమై…
ఓం..నమః శివాయా..హర ఓం నమ: శ్శివాయ
 అని గొంతెత్తి పాడగా భక్తితో జనములు….
పరవశించి కొనియాడవా నిను కని హిమనగములు…
శివ శివ శంకర మహదేవా…శంభో శంకర మహదేవ…

వైవిధ్యభరితమౌ నీ నిత్య అలంకారములు…
దర్శించినంతనే తొలగిపోవు కదా శివా..మాలోని అహంకారములు…
కరములెత్తి నీ ఎదుట నిలిచి నిను మేము మొక్కగా…
మా ఖర్మ ఫలములు తీసుకొని మాకు శుభయోగములనివ్వగా….
మరువగలమా శివా..నిను మేము మరువగలమా…
ఆగగలమా శివా…ధ్యానించక నిను మేము ఆగగలమా…
తెలియని బంధమవుతావు శివా…నీ మాయలో పడితే…
తెగిపోని సంబంధమవుతావు శివా…నీ సేవలో మునిగితే…
నీ దివ్యప్రపంచములో ఉండనిస్తావు మమ్ము…
అనూహ్య ప్రేమతో అనునిత్యం కాపు కాస్తావు మమ్ము…

పాహిమాం…పాహిమాం..శివా…
రక్షమాం..రక్షమాం…శివా…

Leave a Comment

Scroll to Top