దయకనరా శివా…దయకనరా…
దాక్షాయినీ పతీ దయకనరా…
ద్వాదశ లింగాలుగా ధరణీ తలముపై వెలసిన
దేవా..దయకనరా….
మాదశలు మార్చగా నువ్వే దిక్కని కొలిచిన దేవా
దయకనరా…!!దయ!!
ఢం ఢం అను నీ ఢమరుకనాదము
ఘల్ ఘల్ అను నీ గజ్జెల శబ్ధము
విని దరి చేరునా ఏ కీడైనా నీ భక్తుల చెంతకు…
తన ఉనికిని చాట సాహసించునా నీ దీవెనలు
ఉన్నంతవరకు….
కాపాడు దేవుడవు నువ్వేననీ…
పసివాడు సైతం చెబుతాడనీ…
నమ్మిఉందయా శివా..ఈ లోకము
కదలి రమ్మందయా శివా పలుకుతూ శ్లోకము… !
దయ!!
శక్తికొద్దీ నీకు సేవ చేసేము శివా…
ముక్తి నొసగమని మేము నిన్ను కోరేము శివా…
భక్తి తో నిను మేము కీర్తించువారము…
కీర్తి కాంక్షల నుండి
రక్షించుమనువారము..
ఆదుకోవయ్య…ఆది దేవా…
హృదయాంతరంగానా కొలువున్న దేవా…
మము కావా తరలిరావా…మహిలోన నిలిచి
పోవా….
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..రామలింగేశ్వరాయ రక్షమాం..