కానరా..శివశంకరా…
కావగా..మము దేవరా…
కదలి రా…శంభో హరా..మా కలల దైవం నువ్వురా…
కాలమన్నది…ఆగనని గంగాధరా…
తరుణమన్నది తరలి పోతే రాదురా హర హరా…
రారా శివా..కన రారా…శివా…
నువ్వే శివా…మా సర్వమూ నువ్వే శివా…
ఫాలభాగమున అమరినాడు చంద్రుడు…
నీ త్రినేత్రమును చల్లబరచగా ఆతడు…
పున్నమి వెన్నెల రేయి వెలుగులలో వీక్షించవా శివా…
సన్నని చిరునవ్వుల వరములు కురిపించవా శివా…!!కానరా!!
నీ సిగలోన గంగమ్మ కొలువుండబట్టి…
ఈ మహి మనకలిగివుందయా శివా…పది కాలాలు బట్టి…
కోట్లాది జీవరాశుల గొంతు తడిపావు శివా గంగనే ఇలకు తెచ్చి…
కోటానుకోట్ల సార్లు నిను స్మరించినా తీరని రుణమై కూర్చున్నావు మా మది లోకి వచ్చి…
భిక్షాం..దేహీ అను బిచ్చమెత్తు నీకు…
ఏమిత్తుమని వత్తువు మా కడకు…
ఎరికైందిలే శివా…మా బాధలని మా నుంచి కొనిపోవు కొరకు…
పాహిమాం..పాహిమాం…శివా…పాహిమాం..
రక్షమాం..రక్షమాం..శివా…రక్షమాం..