చూడ చక్కని వోడు..మా చంద్రశేఖరుడు…

చూడ చక్కని వోడు..మా చంద్రశేఖరుడు…
కోరమీసాలోడు కాత్యాయినీ విభుడు…
ఆదిశంకరుడతడు..అడ్డ నామాలోడు..
ఏ కష్టమొచ్చినా  అడ్డుకోగలడతడు…
మూడు కన్నుల వాడు…ముందెనక చూడడు..
ముప్పు ముందుందంటే తాను
ముందుంటాడు…
ఎవ్వరండీ…మననింత కాపువాడు…
ఇంకెవ్వరండీ…మన మల్లికార్జునుడు..
రండి రండందరూ చేద్దాము ఆ తండ్రి తిరునాళ్ళు…
భక్తి భావనలు మనలోన ఉబికుబికి తొక్కాలి పరవళ్లు….
అంబరాన్నంటేటి సంబరాన్నీ చూసి ఆ సాంబశివునీ కళ్లు…
కురిపించవా మనపైన వద్దన్నా  దీవెనల వడగళ్ళు…
ఇద్దాము..హృదయ హారతుల నీరాజనాలు ఆ తండ్రికి…
మ్రోగిద్దాము…ప్రణవ గానాల డంఖా  నాదాలు తన పూజకి…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
పగలు రేయనక నిను తలచు వరమియ్యరా…

Leave a Comment

Scroll to Top