రవిచంద్రమయ శివలింగ రూప పరమేశ్వరా….
ఏ బంధమని అడుగుపడదో శలవియ్యరా నీ లింగ రూపము కనిన సర్వేశ్వారా..
మా పైన ప్రేమున్న మల్లేశ్వరా..వరమియ్యరా ఆర్థితో ఆలింగనము చేసుకొన నిను అరుణాచలేశ్వరా…
పాహి…పాహి..అంటూ ప్రార్ధనలు చేసేము….
రక్ష…రక్ష…అంటూ రక్షింపకోరేము…
రాతి లింగమను భావనేలేదయా శివా..
మాతల రాతను వ్రాయు జంగమయే నువ్వయ్యా శివా…
రూపమే లేని రాయివనుకోలేదయా శివా…
మా పాపములు నెడబాయు కరుణామయుడు నువ్వయా శివా…
ఏ రాయిలో నున్నా మా పాలి భగవంతుడా…
ఏ వేళనైనా నువ్వేకదా శివా మా అండ దండ…
ఏ పుణ్యవేళ ఉద్భవించెనో నీ లింగ రూపము…
మా పాలి దైవమైన ఈ శివ లింగ రూపము…
శ్రీ రాముడే పూజించిన రూపమిది నీ లింగము…
నిను స్మరించి చేయుకార్యానికి కలుగునా శివా భంగము….
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
పాల మీగడలతో అభిషేకాలు చేసేము కరుణించరా…