మూడు కన్నుల శివా…నిను మొక్కనీకి మాకు మూడు దళముల మొక్కనిస్తివా శివా….
వేయి జన్మలకు సరిపడా వేడుకొమ్మని రుద్రాక్ష ఫలముల కొమ్మలిస్తివా శివా…
ఎంత దయరా శంకరా..నీకు ఇలపైన భక్తులంటే..
పూజించమా శివా….నిను ఇంకా ఇంకా మునుపటికంటే….
పాహిమాం…పాహిమాం…పార్వతీశా పాహిమాం….
రక్షమాం…రక్షమాం…రామలింగేశ్వర రక్షమాం….
ప్రేమతో తేరిపార కళ్లింత చేసి చూస్తున్నట్లుంది శివా మా గుండె లోతులని….
ఎన్నాళ్ళనుంచో వేచి ఉన్నామయా శివా ఆ శుభఘడియ ఎపుడొస్తుందోనని….
తెలుసుకోవయ్య శివా…ఆదిదేవునివై మా బాధలు,బరువులు….
పంచుకోవయ్య శివా…ఆత్మబంధువై మా కష్టాలు,సుఖాలు….
మరువమయ్యా శివా…నీ మేలు ముమ్మాటికీ….
వదలమయ్యా శివా…నీ వేలు ఏనాటికీ…
కదలునా శివా…మా జీవితాలు నీ దయ లేకుంటే అంగుళమైనా ముందుకు….
నడవవా శివా అవి…నీ సేవలో పడి మునిగితే ఆగక మును ముందుకు…
నీ దయ పొందేందుకు…నీ దరి చేరేందుకు…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వర రక్షమాం…