ఓం నమఃశ్శివాయా నమః
నాగరాజ ప్రియా శివా పాహిమాం..
నాగేశ్వరాయా హరా రక్షమాం…
ఏ పూజ చేసెనో సర్పము నీ కరుణ కోసము…
ఏ నోము నోచెనో ఆ నాగు నీ చెలిమి కోసము…
నీలకంఠాయా శివా పాహిమాం…
గరళ కంఠాయా శివా రక్షమాం…
పన్నగమునకిచ్చావు శివా మెడలోన స్థానము…
ప్రియ భక్తులను ప్రేమింతువనుటకు ఇది తార్కాణము…
పరమేశ్వరుడే నాగేశ్వరుడైన వైనము…
తలచుకుంటే… ఆహా..శివా…నీ ప్రేమ ఎంత ఘనము….
ఏ పూజ చేయాలి శివా మేము… ఆ వరము కొరకు….
ఏ సేవ చేయాలి శివా మేము… ఆ కల నెరవేరు కొరకు…
విష నాగునే చేరదీసిన విశాల హృదయుడవయ్యా నువ్వు….
విషమ పరిస్థితులనుండి గట్టెక్కించు దేవుడివయ్యా నువ్వు….
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..నాగాభరణ నాగేశ్వరా రక్షమాం…