ఓం నమః శివాయ నమః
మింగావుగా శివా..మింగావుగా..
గరళాన్ని గడ గడ మింగావుగా…
సురులను కరుణించి రక్షించగా…
అసురులను గజ గజా వణికించగా..
భగ భగల బడబాగ్నినిమింగావుగా…
భుగ భుగల పొగల కాలకూటమును త్రాగావుగా…
లోకాల రక్షింప లోకేశ్వరుడివైనావుగా..
సకల ప్రాణి కోటిని సృష్టించి సర్వేశ్వరుడివైనావుగా…
త్రాగరా శివా…అర్పించినాము గిన్నెడు భక్త్యామృత క్షీరాన్ని నీ కంఠాన సెగలు చల్లారగా….
చాలురా శివా..కుదుటపడితే చాలు మా పార్వతీ తల్లి మనసు నీ కంఠాన ఆ నీలినీడలు సమసి పోగా…
ఇచ్చింది గిన్నెడని చిన్నబోకు…
పెద్ద వృక్షమైన విత్తు చిన్నదే తెలుసుకదరా…
దయతోడ స్వీకరించి మమ్ము కావరా…
దాక్షాయణి తో కలిసి లోకమ్ములేలరా…
పాహిమాం..పాహిమాం..శివా…